23, మార్చి 2014, ఆదివారం

శ్రీ సుర్యభగవానుని స్తోత్రం

                                                        ఓం శ్రీ సవిత్రే నమః 
శా .    ఓంకారంబున  సంభవించు జగమాయోం కార మందమత మౌ 
        నోంకారంబునవృద్ధిజెందు సలంబొంకారమై యొప్పు నా 
        యోంకారాకృతి యై వెలింగెడి పరం జ్యోతిన్ పరబ్రహ్మమున్ 
        ఓంకారప్రణవ స్వరూపునకు దేజోమూర్తికిన్ మ్రొక్కెదన్ .
ఉ .   శ్రీయుననా మయం బయిన జీవన మాయువు నాత్మ విద్యయున్ 
        బాయని ప్రేమ నిత్తువట భక్తులకున్ జగదీశ సర్వదా 
        నాయెడ సత్కృపన్ గలిగి నాస్తవమున్ దయ స్వీకరించి నన్
        శ్రీ యుతమూర్తి బ్రోవగదె చిత్తమునన్ వసియించి భాస్కరా !
చ.    సరసిజబాంధవా!నిగమసన్నుత!దీనశరన్య!మౌనిఖే 
        చరగరుడోరగ ప్రముఖ సన్నుత భక్త జనావనా శుభం 
         కర శరణంటి బ్రోవగదె కాలనియామక, కాల రూప! యో 
         హరిహర ధాతృ తేజ!పరమాత్మ!దయానిధి!దేవ!భాస్కరా!
మ.    వికలాంగుల్ జడులంధులున్ బధిరులున్ విశ్వాత్మకంబై న నీ 
          యకలంకోత్తమ దివ్య నామమును నిత్యంబున్ స్మరింపన్ భువిన్ 
         సకలారిష్టము లంతరింప శుభముల్ సౌఖ్యంబులన్ బొంది పా 
         యకస్వర్గంబును గాంతు రంతమున దేవా!సూర్యనారాయణా!
శా .   త్రే తాగ్నుల్ చతురాగమంబులు ధరిత్రిన్ బంచ భూతంబు లున్ 
         శీతోష్ణాది విబేధ కాల ఋతువుల్ శీతాంశులు గ్రంశులున్ 
         వాలో ద్దూత మహోగ్ర వృష్టి విలయ వ్యాపార సృష్టి స్టితుల్
         భూతేశా!భువి నీవ!నీవలన వే బోల్పోందు నో భాస్కరా !
మ.    ర దేవాసుర మౌని దివ్యు లేవరైనను గాని నీ రాకచే 
          నురు కర్తవ్యము,కాలకృత్యములు,సంధ్యో పాసనల్ సేయుచున్ 
           ధరలో జీవితయాత్ర సల్పుదురు నిన్ దర్శింప లేకున్న నె 
          వ్వరు కర్తవ్య మెరుంగ లేరుగద !దేవా ! సూర్యనారాయణా !
మ.     మహనీయుల్ ఋషులున్,ద్విజుల్ బుధవరుల్ మార్తాండ నిన్భక్తి తో 
           గ్రహరాజా !భవదీయ దర్శన మె దన్ గాంక్షించి పూతాత్ములై 
           బహు మంత్రోక్తుల నర్ఘ్య  పాద్యములతో "బ్రహ్మార్పణం"బంచు నిన్ 
           బహురీతిన్ ప్రచిం చు చుందురు పరబ్రహ్మ స్వరూపా !రవీ !                    

1 కామెంట్‌:

  1. Google search లో శ్రీ సూర్యభగవానుని గురించిన పద్యాలలో ఈ పద్యాలను చేర్చండి

    రిప్లయితొలగించండి