వడ్డూరి అచ్యుతరామ కవి రచనలు
12, ఆగస్టు 2015, బుధవారం
2, ఏప్రిల్ 2014, బుధవారం
తలతున్ భక్తజనావనునున్ గజముఖున్ దాంతున్ దయాస్వాంతునిన్
కలుషారణ్యదవానలున్,
వరదు రాగద్వేష దు:ఖాంతకున్
తొలిపూజల్గొనువాని
భక్త సులభున్ దోషాపహున్ సర్వ వి
ద్యలు
సౌభాగ్యము లిచ్చునట్టి నెఱదాతన్ శ్రీ గణాధీశ్వరున్ !
శ్రీ గణనాయకా వరద సిద్ధి
వినాయకా ఆదిపూజితా
ఆగమవందితా సురగాణార్చిత విఘ్న
వినాశకారణా
వేగమె నాతలంపు నెరవేర్పర
బాలశశాంక భూషణా
భోగి బిభూషణా సుజన పోషణ భూరి
భవాబ్ది శోషణా!
25, మార్చి 2014, మంగళవారం
ఎన్నిమారులు
చూచిననేమొగాని
తనివిదీరదు
నీదివ్య దర్శనంబు
చూచినను
చూచుచున్నను చూడగోరు
చూపుమికెప్పుడు
నీదివ్య రూపమభవ !
శ్రీ
మద్వెంకట శైలమందు విభవ శ్రీ మీర నాంచారియున్
భామారత్నము
మంగమాంబయును సంభావించి సేవింపగా
కామారాతి
మహేంద్ర ముఖ్యులు నుతుల్ గావింప భక్తాలికిన్
సేమంబుల్
సమకూర్చు దేవు గొలుతున్ శ్రీ వెంకటేశప్రభున్
నరక
మురాదిదానవ వినాశనకారికి దుఃఖహారికిన్
గరుడవిహారికిన్
మహిత కౌస్తుభధారికి చక్రధారికిన్
దురిత
విదారికిన్ జనన దుఃఖనివారక నామధారికిన్
తిరుమల
వెంకటేశు నకు దేవరకున్ శరణా ర్ధి నయ్యెదన్!
పంకజాసన
వాసవార్చిత భక్తలోక శుభంకరా !
వేంకటాచలవాస!
కేశవ విస్వకారణ శ్రీధరా!
శంకరార్చిత
పాదపంకజ శంఖచక్ర గదాధరా !
వేంకటేశ్వర!
వేంకటేశ్వర ! వేంకటేశ్వర ! పాహిమాం !!
పరమపావన
భక్త జీవన పాపకానన దాహనా !
గరుడవాహన
లోకమోహన కంజ సన్నిభ లోచనా!
శరధి శయన
రమా మనోహర సర్వలోక నియామకా!
తిరుమలేశ్వర
వేంకటేశ్వర దీనరక్షక రక్షమాం !!
శ్రీకరంబగు
వేంకటాచల శిఖరమందు వసించుచున్
ప్రాకటంబుగ
భక్తులను గాపాడుచుందువు దేవరా !
నీకు
మ్రొక్కెద బ్రోవవే నను నీలనీరద వర్ణ లో
కైక నాయక
వేంకటేశ్వర గరుడవాహన శ్రీహరీ !!
23, మార్చి 2014, ఆదివారం
శ్రీ సుర్యభగవానుని స్తోత్రం
ఓం శ్రీ సవిత్రే నమః
శా . ఓంకారంబున సంభవించు జగమాయోం కార మందమత మౌ
నోంకారంబునవృద్ధిజెందు సలంబొంకారమై యొప్పు నా
యోంకారాకృతి యై వెలింగెడి పరం జ్యోతిన్ పరబ్రహ్మమున్
ఓంకారప్రణవ స్వరూపునకు దేజోమూర్తికిన్ మ్రొక్కెదన్ .
ఉ . శ్రీయుననా మయం బయిన జీవన మాయువు నాత్మ విద్యయున్
బాయని ప్రేమ నిత్తువట భక్తులకున్ జగదీశ సర్వదా
నాయెడ సత్కృపన్ గలిగి నాస్తవమున్ దయ స్వీకరించి నన్
శ్రీ యుతమూర్తి బ్రోవగదె చిత్తమునన్ వసియించి భాస్కరా !
చ. సరసిజబాంధవా!నిగమసన్నుత!దీనశరన్య!మౌనిఖే
చరగరుడోరగ ప్రముఖ సన్నుత భక్త జనావనా శుభం
కర శరణంటి బ్రోవగదె కాలనియామక, కాల రూప! యో
హరిహర ధాతృ తేజ!పరమాత్మ!దయానిధి!దేవ!భాస్కరా!
మ. వికలాంగుల్ జడులంధులున్ బధిరులున్ విశ్వాత్మకంబై న నీ
యకలంకోత్తమ దివ్య నామమును నిత్యంబున్ స్మరింపన్ భువిన్
సకలారిష్టము లంతరింప శుభముల్ సౌఖ్యంబులన్ బొంది పా
యకస్వర్గంబును గాంతు రంతమున దేవా!సూర్యనారాయణా!
శా . త్రే తాగ్నుల్ చతురాగమంబులు ధరిత్రిన్ బంచ భూతంబు లున్
శీతోష్ణాది విబేధ కాల ఋతువుల్ శీతాంశులు గ్రంశులున్
వాలో ద్దూత మహోగ్ర వృష్టి విలయ వ్యాపార సృష్టి స్టితుల్
భూతేశా!భువి నీవ!నీవలన వే బోల్పోందు నో భాస్కరా !
మ. నర దేవాసుర మౌని దివ్యు లేవరైనను గాని నీ రాకచే
నురు కర్తవ్యము,కాలకృత్యములు,సంధ్యో పాసనల్ సేయుచున్
ధరలో జీవితయాత్ర సల్పుదురు నిన్ దర్శింప లేకున్న నె
వ్వరు కర్తవ్య మెరుంగ లేరుగద !దేవా ! సూర్యనారాయణా !
మ. మహనీయుల్ ఋషులున్,ద్విజుల్ బుధవరుల్ మార్తాండ నిన్భక్తి తో
గ్రహరాజా !భవదీయ దర్శన మె దన్ గాంక్షించి పూతాత్ములై
బహు మంత్రోక్తుల నర్ఘ్య పాద్యములతో "బ్రహ్మార్పణం"బంచు నిన్
బహురీతిన్ ప్రచిం చు చుందురు పరబ్రహ్మ స్వరూపా !రవీ !

17, మార్చి 2014, సోమవారం
రచన వడ్డూరి అచ్యుతరామ కవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)